మార్చి 17న ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలు

15 Feb, 2017 04:06 IST|Sakshi

- షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ
- హైదరాబాద్‌ స్థానానికి, ఏపీలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు


సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ:
రాష్ట్రంలోని హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయింది. మార్చి 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఈ స్థానంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ సయ్యద్‌ అమినుల్‌ హాసన్‌ జాఫ్రీ పదవీకాలం మే 1వ తేదీన ముగియనుంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈఎన్నికల కోసం ఈనెల 21న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్‌ డైరెక్టర్‌ ధీరేంద్ర ఓఝా ఎన్నికల షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల నిబంధనావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌

  • ఈ నెల 21న ఎన్నికల నోటిఫికేషన్‌
  • 21 నుంచి 28 వరకు నామినేషన్ల స్వీకరణ
  • మార్చి 1న నామినేషన్ల పరిశీలన
  • 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు
  • 17న ఉదయం 8 నుంచి     సాయంత్రం 4 వరకు పోలింగ్‌
  • 20న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

 
రెండో రోజూ ఎమ్మెల్సీ నామినేషన్లు నిల్‌  
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, రంగా రెడ్డి, మహబూ బ్‌నగర్‌ ఉపాధ్యాయ శాసన మండలి స్థానానికి నామినేషన్ల రెండో రోజు మంగళవారం కూడా ఒక్క నామినేషన్‌ దాఖలు కాలేదు. జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ అద్వైత్‌ కుమార్‌సింగ్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న ఈ ఎన్నికల నామినేషన్లను జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాల యంలో స్వీకరించడానికి ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు