ఆ దర్శకుడితో డబ్బు డిమాండ్ చేయడం తప్పు

25 Oct, 2016 18:54 IST|Sakshi
ఆ దర్శకుడితో డబ్బు డిమాండ్ చేయడం తప్పు

న్యూఢిల్లీ: బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ భారత సైన్యానికి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని ఎంఎన్ఎస్ డిమాండ్ చేయడం తప్పని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ ప్రతిపాదన సరికాదని, ఎంఎన్ఎస్ వాదనతో ఏకీభవించబోమని చెప్పారు. 

పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన కరణ్ జోహార్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్ విడుదల కాకుండా అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం పరిష్కరించుకునేందుకు ఇటీవల కరణ్ జోహార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేలను కలిశాడు. పాక్ నటులకు ఇకమీదట తన సినిమాల్లో అవకాశం ఇవ్వబోనని కరణ్ చెప్పాడు. భారత సైన్యానికి ఐదు కోట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే డిమాండ్ చేయగా, కరణ్ ఇందుకు అంగీకరించాడు. ఈ విషయంపై వెంకయ్య స్పందిస్తూ.. మరో పార్టీ చేసిన ప్రతిపాదనతో తనకు సంబంధంలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో భద్రత కల్పించడం ఆ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని అన్నారు.
 

మరిన్ని వార్తలు