జోరుగా యాప్ ఆదాయం

20 Sep, 2013 03:22 IST|Sakshi
జోరుగా యాప్ ఆదాయం

 న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మొబైల్ యాప్‌ల డౌన్‌లోడ్ ఆదాయం ఈ ఏడాది 44 శాతం వృద్ధి చెంది 2,600 కోట్ల డాలర్లకు చేరుతుందని రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ తెలిపింది. యాప్‌ల జోరు రెండు, మూడేళ్లలో బాగా పెరిగి, ఆ తర్వాత తగ్గుతుందంటున్న ఈ సంస్థ వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు  గత ఏడాది 6,400 కోట్ల యాప్‌లు డౌన్‌లోడ్ అయ్యాయి.  1,800 కోట్ల       డాలర్ల ఆదాయం లభించింది.  ఈ ఏడాది 10,200 కోట్ల యాప్‌లు డౌన్‌లోడ్ అయ్యే అవకాశాలున్నాయి.  మొత్తం యాప్ డౌన్‌లోడ్స్‌ల్లో ఉచిత యాప్‌ల వాటా 91 శాతంగా     ఉంటుందని అంచనాలున్నాయి.  వచ్చే ఏడాది యాప్‌ల డౌన్‌లోడ్ మరింత జోరుగా ఉంటుంది.


  మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ మోడళ్లు రావడం, యాప్‌ల సంఖ్య పెరుగుతుండడం వంటి కారణాల వల్ల వచ్చే ఒక్కో మొబైల్ వినియోగదారుడు సగటున ఉపయోగించే యాప్‌ల సంఖ్య బాగా పెరుగుతోంది.  నచ్చిన యాప్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి, కొత్త యాప్‌లను వినియోగదారులు పట్టించుకోరు. ఫలితంగా తర్వాతి సంవత్సరాల్లో యాప్‌ల డౌన్‌లోడ్ జోరు తగ్గవచ్చు.
  2017లో డౌన్‌లోడయ్యే మొత్తం యాప్‌ల్లో 90 శాతం వరకూ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లే ఉంటాయి.
 

మరిన్ని వార్తలు