సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన జింగ్పింగ్

17 Sep, 2014 20:20 IST|Sakshi
సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన జింగ్పింగ్

అహ్మదాబాద్‌: చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ భారత పర్యటన మొదలు పెట్టారు. ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్‌ చేరుకున్న జింగ్‌పింగ్‌ కు ఘనస్వాగతం లభించింది. గుజరాత్ ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. తర్వాత హయాత్ హోటల్ లో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన జింగ్ పింగ్, ఆయన సతీమణికి ప్రధాని నరేంద్ర మోడీ పుష్పగుచ్చంతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మూడు ఒప్పందాలపై భారత్-చైనా సంతకాలు చేశాయి.

సాయంత్రం సబర్మతి ఆశ్రమాన్ని జింగ్పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా చైనా భాషలో ఉన్న భగవత్ గీతను జింగ్పింగ్కు మోడీ బహూకరించారు. రాత్రికి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు.

మరిన్ని వార్తలు