వామ్మో... అంత కరెంట్ బిల్లా?

25 Dec, 2015 11:30 IST|Sakshi
వామ్మో... అంత కరెంట్ బిల్లా?

మొరదాబాద్: పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం అంటే ఇదేనేమో. జాతీయ వినియోగదారుల దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్ లో విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యంతో ఓ వినియోగదారుడికి పెద్ద షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీల్) అధికారులు పంపిన కరెంట్ బిల్లు చూసి సదరు వినియోగదారుడికి గుండె ఆగినంతపనైంది. రూ.232 కోట్లు కట్టాలని బిల్లు ఇవ్వడంతో అతడు అవాక్కయ్యాడు.

మొరదాబాద్ లో ఓ చిన్న పరిశ్రమ నడుపుతున్న పరాగ్ మిత్తల్ అనే వ్యక్తి ఈ భారీ బిల్లు వచ్చింది. 300,00,92,466 యూనిట్లు వాడినందుకు రూ. 232,07,08,464 కట్టాలని బిల్లులో చూపించారు. పాషిమంచల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఈ బిల్లు వచ్చింది. అయితే మిత్తల్ కంపెనీకి 49 కిలోవాట్ల వరకు మాత్రమే విద్యుత్ వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే రూ.232 కోట్ల కరెంట్ బిల్లు వచ్చిందని పీవీవీఎన్ లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు