నాలుగేళ్లు బందీలుగా తల్లీకూతుళ్లు!

23 Mar, 2017 16:27 IST|Sakshi
నాలుగేళ్లు బందీలుగా తల్లీకూతుళ్లు!

దాదాపు నాలుగేళ్ల నుంచి ఢిల్లీలోని తమ ఇంట్లో తమను తామే బందీలుగా చేసుకున్న తల్లీకూతుళ్లను ఢిల్లీ పోలీసులు రక్షించారు. వాళ్లిద్దరూ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కళావతి (42), దీప (20) అనే ఇద్దరూ ఇలా బందీలుగా ఉన్న విషయాన్ని వాళ్లింటి పొరుగున ఉండే ఓ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. దాంతో వారు వెళ్లి తల్లీ కూతుళ్లిద్దరినీ బయటకు తీసుకొచ్చి, ఆస్పత్రిలో చేర్చారు.

వాళ్లతో పాటు అదే ఇంట్లో ఉంటున్న మహిళ మామను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మహిళలిద్దరూ పోషకాహారం లేక బాగా నీరసించిపోయారని, వాళ్లు చాలా అపరిశుభ్ర వాతావరణంలో ఉంటున్నారని చెప్పారు. అంతలా ఉన్నా పోలీసుల వెంట ఆస్పత్రికి వెళ్లేందుకు వారు నిరాకరించారు. వాళ్లిద్దరూ మానసిక వ్యాధితోను, భ్రమలతోను జీవిస్తున్నారని తెలిపారు. వాళ్లు భోజనం కావాలని అడిగినప్పుడు పక్క గదిలోనే ఉండే కళావతి మామగారు మహావీర్ మిశ్రా వాళ్లకు భోజనం పెట్టేవారు.

తన భార్య 2000 సంవత్సరంలో మరణించిందని, కొడుకులిద్దరూ నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారని మిశ్రా చెప్పారు. అప్పటినుంచే కళావతి, దీప తమను తాము ఇంట్లో పెట్టుకుని గడియ వేసుకున్నారన్నారు. తాను ఎంటీఎన్ఎల్‌లో లైన్‌మన్‌గా పనిచేసేవాడినని, తనకు వచ్చే కొద్దిపాటి పెన్షన్‌తోనే అందరం బతుకుతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు