బంక్లో 72 వేల లీటర్ల కిరోసిన్ పట్టుకున్న మంత్రి

29 May, 2015 21:16 IST|Sakshi
బంక్లో 72 వేల లీటర్ల కిరోసిన్ పట్టుకున్న మంత్రి

ఖర్గోనే(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో ఓ పెట్రోల్ బంక్పై పౌరసరఫరాలశాఖ మంత్రి తనిఖీ బృందాలతో దాడులు నిర్వహించి దాదాపు 72 వేల లీటర్ల కిరోసిన్ పట్టుకున్నారు. ఆ బంక్ వాళ్లనే కాదు మొత్తం అధికారులనే అవాక్కయ్యేలా చేశారు. ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న విజయ్ షాకు గత కొంతకాలంగా పెట్రోల్ బంక్ వారు డీజిల్, పెట్రోల్లో బాగా కల్తీ చేస్తున్నారని, కిరోసిన్ కలుపుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.

దీంతో ఆయన శుక్రవారం పనిగట్టుకొని గుట్టుచప్పుడు కాకుండా సదరు పెట్రోల్ బంక్కు షాక్ ఇచ్చారు. అక్కడే నెంబర్ ప్లేట్స్ లేని ఓ కంటెయినర్ మరో పెట్రోల్ ట్యాంకర్లను గుర్తించారు. పెట్రోల్ బంక్ వెనుక భాగంలో ఈ కిరోసిన నిల్వచేసి ఉంచినట్లు గుర్తించామని చెప్పారు. ఇందులో 40 వేల లీటర్లు బ్లూ కిరోసిన్, 32 వేల లీటర్లు తెల్ల కిరోసిన్ గుర్తించినట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు