రేపు వెల్లడికానున్న జియో భవిష్యత్

31 Aug, 2016 09:48 IST|Sakshi
రేపు వెల్లడికానున్న జియో భవిష్యత్
ముంబై : టెలికాం కంపెనీల గుండెల్లో గుబేలు పుట్టిస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళిక గురువారం వెల్లడికానుంది. రేపు జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్లాన్ వివరాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న టారిఫ్ ప్లాన్ వివరాలు ఈ సమావేశంలో ముకేశ్ వివరించనున్నారని అధికారులు పేర్కొంటున్నారు.ఎల్వైఎఫ్ వంటి ప్రత్యేక కేటిగిరీ యూజర్లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ టారిఫ్ ప్యాకేజీలను ప్రకటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే జియో గుబులుతో రేట్లలో భారీగా కోత విధిస్తున్న టెలికాం పరిశ్రమ ఈ టారిఫ్ వివరాలపై ఎక్కువగా దృష్టిసారించింది. అదేవిధంగా టారిఫ్ ప్లాన్స్ కు సంబంధించిన వివరాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కు కూడా త్వరలోనే ఫైల్ చేయాలని జియో భావిస్తోంది.
 
అయితే ఈ సమావేశంలో వెల్లడించబోయే టారిఫ్ వివరాల్లో ఎల్వైఎఫ్ కస్టమర్లకు స్పెషల్ ప్లాన్స్ అందనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎక్స్క్లూజివ్గా ఎల్వైఎఫ్ కస్టమర్లతో పాటు లీడింగ్ స్మార్ట్ఫోన్ బ్రాండ్లకు జియో తన ప్రీవ్యూ ఆఫర్ను అందిస్తున్న సంగతి తెలిసిందే.  ఎల్వైఎఫ్ హ్యాండ్ సెట్ విక్రయాలను పెంచి, భారత్ టాప్ -3 బ్రాండ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ స్పెషల్ టారిఫ్ ప్లాన్స్ను ఈ ఫోన్లకు అందించాలని ముకేశ్ భావిస్తున్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలోనే జియో కమర్షియల్ లాంచింగ్ ఆపరేషన్ తేదీలు కూడా వెల్లడికానున్నాయట. ఈ ప్రతిపాదిత లాంచింగ్ తేదీ వివరాలు కేవలం ముకేశ్ అంబానీకి, కీ ఎగ్జిక్యూటివ్లకు మాత్రమే తెలుసని కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు. . 
మరిన్ని వార్తలు