లిక్కర్ కింగ్ మాల్యాకు మరో షాక్

21 Nov, 2016 16:46 IST|Sakshi
లిక్కర్ కింగ్ మాల్యాకు మరో షాక్
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో షాక్ ఎదురైంది. ఆయనపై ముంబై కోర్టు  నాన్-బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి, మనీ లాండరింగ్కు పాల్పడిన కేసులో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ వారెంట్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) యూకేకు బదలాయించనుంది. బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి, ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్న మాల్యాను భారత్కు పంపించాలని కోరుతూ.. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద ఈ వారెంట్ను సీబీఐ యూకేకు పంపనుంది.
 
ముంబైలోని  పీఎంఎల్ఏ కోర్టులో మాల్యా ఈ ఏడాది జూలైలో హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి, మాల్యా కోర్టు ముందు హాజరు కాలేదు. మార్చిలో దేశం విడిచిపారిపోయిన మాల్యా ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఆయనపై పలు చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో ఓ సారి ఇప్పటికే ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీచేసింది. మరోసారి మాల్యాకు ముంబై స్పెషల్ కోర్టు షాకిచ్చింది. 
మరిన్ని వార్తలు