భుట్టో హత్యకు ముషార్రఫ్ బాధ్యుడు

18 Oct, 2015 05:10 IST|Sakshi
భుట్టో హత్యకు ముషార్రఫ్ బాధ్యుడు

 అమెరికన్ జర్ లిస్టు మార్క్ సీగెల్ వాంగ్మూలం
 
 ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకు ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్  ముషార్రఫ్ బాధ్యుడని.. అమెరికన్ జర్నలిస్టు మార్క్ సీగెల్ తెలిపారు. హత్య కేసులో కీలక సాక్షిగా మారిన సీగెల్.. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి రావల్పిండి కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్‌లో వాంగ్మూలం ఇచ్చారు. తన ప్రాణాలకు ముప్పుందని, ప్రత్యేకంగా విదేశీ భద్రతా సిబ్బందిని పెట్టుకునేందుకు అనుమతివ్వాలని భుట్టో పలుమార్లు విజ్ఞప్తి చేసినా ముషార్రఫ్ పట్టించుకోలేదన్నారు.

ఓ గల్ఫ్  నిఘా సంస్థ అడ్డుకున్న ఓ ఫోన్ కాల్ ద్వారా.. భుట్టో హత్యకు కుట్ర జరుగుతోందని వెల్లడైందని.. ఈ సంభాషణలో ముగ్గురు ముషార్రఫ్ సహచరులూ ఉన్నారని తెలిపారు. 2007 డిసెంబర్ భుట్టోపై బాంబు దాడి జరిగిన సమయంలోనూ.. ఆమె వాహనానికి అమర్చిన మొబైల్ జామర్లు పనిచేయలేదని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు