13వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన ఎంపీ

28 Sep, 2015 19:49 IST|Sakshi
13వేల అడుగుల ఎత్తు నుంచి దూకిన ఎంపీ

మైసూరు: కర్ణాటకలో తొలిసారి ప్రతాప్ సింహా అనే ఎంపీ రికార్డు సృష్టించాడు. ఏకంగా 13,000 అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్ చేసి అబ్బుర పరిచారు. ఆయన ఈ సాహసం చేసే సమయంలో తోడుగా ఓ అమెరికన్ మెంటర్ కూడా ఉన్నారు. సోమవారం ఈ ఎడ్వంచర్ ఫీట్కు ఆయన తెర తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి అధికారికంగా స్కై డైవింగ్ చేసే కార్యక్రమాన్ని మైసూరులో ప్రారంభించిన విషయం తెలిసిందే. మైసూరు, కొడగు జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ఆయన ఈ పనిచేశారు. ప్రతాప్ సింహా(38) మైసూరు కొడగు జిల్లాల నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు.

స్కై డైవ్ చేసిన తర్వాత సురక్షితంగా మైసూరు విమానాశ్రయంలో దిగిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ' నాలుగు సీట్లు మాత్రమే ఉండే సెస్నా విమానంలో కూర్చున్న నేను నా మనసులో నిర్ణయించుకున్నట్లుగా 13,000 అడుగుల ఎత్తుకు వెళ్లాను. జంప్ చేయడానికి కొద్ది సమయం ముందు కొంత భయం వేసింది. కానీ చివరికి జంప్ చేశాను. దాంతో ఈ సాహసం నా జీవితంలోనే ఒక గొప్ప అనుభవంగా మిగిలిపోయింది. డైవింగ్ చేస్తున్న సమయంలో నేను ఎంత థ్రిల్గా ఫీలయ్యానో వర్ణించలేను. మైసూరులో స్కై డైవింగ్ కార్యక్రమాన్ని సుకాకిని అనే ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. దేశంలో ఇలాంటి సాహస కృత్యాలు అతి కొద్ది మంది నాయకులు మాత్రమే చేశారు.

>
మరిన్ని వార్తలు