టాటా మోటార్స్కు కొత్త చైర్మన్

17 Jan, 2017 20:16 IST|Sakshi
న్యూఢిల్లీ : టాటా సన్స్ చైర్మన్గా ఎంపికైన ఎన్ చంద్రశేఖరన్, గ్రూప్ కంపెనీ అయిన టాటా మోటార్స్కు చైర్మన్గా నియమితులయ్యారు. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నటరాజన్ చంద్రశేకరన్ను అడిషినల్ డైరెక్టర్గా, చైర్మన్గా ఎంపికచేసినట్టు కంపెనీ ప్రకటించింది. వెంటనే ఆయన కంపెనీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా చంద్రశేఖరన్ను నియమిస్తున్నట్టు వెల్లడించిన వారంలోనే టాటా మోటార్స్ కూడా చంద్రశేఖరన్ను చైర్మన్గా ఎంపికచేసేసింది. రెండు నెలల క్రితం సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ చైర్మన్గా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
 
టాటా-మిస్త్రీ బోర్డు వార్ అనంతరం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రూప్ కంపెనీలు కూడా మిస్త్రీపై వేటువేశాయి. 150 ఏళ్ల టాటా గ్రూప్కు మొదటి నాన్-పార్సీ చైర్మన్ చంద్రశేఖరనే. ఫిబ్రవరి 21న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. టాటా మోటార్స్ చైర్మన్గా ఎంపికైన ఈయన రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్టు నానో కారుపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. భావోద్వేగ కారణాలతో నష్టాల్లో ఉన్న నానో ప్రాజెక్టును టాటా మోటార్స్ మూసివేయడం లేదని మిస్త్రీ ఈ ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
 
 
మరిన్ని వార్తలు