పీఎంఓపై సీఎం విమర్శలు

26 Sep, 2015 17:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర పాలన వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ జోక్యంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. జంగ్ మంచి వ్యక్తే కానీ, రాజకీయ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆదేశాల మేరకు జంగ్ వ్యవహరిస్తున్నారని, ఆయన్ను పదవి నుంచి తొలగించినా ఉపయోగం ఉండదని విమర్శించారు. జంగ్ను తొలగించినా కొత్త ఎల్జీ కూడా పీఎంఓ ఆదేశాలనే పాటిస్తారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ పాలన వ్యవహారాల్లో పీఎంఓ జోక్యం చేసుకోకుంటే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ఇదిలావుండగా, జంగ్ను తొలగించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు