జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

31 May, 2014 18:26 IST|Sakshi
జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: జీవోఎంలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. పాలనలో పారదర్శకత కోసం జీవోఎంలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జీవోఎం పరిధిలో మిగిలిపోయిన నిర్ణయాలను ఇక నుంచి సంబంధిత శాఖలే చూసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో 21 మంత్రుల బృందాలు (జీవోఎం), 9 సాధికారిక బృందాలు(ఈజీవోఎం)లపై వేటు పడింది. ఇప్పటివరకూ పలురకాలైన అంశాలపై జీవోఎం కమిటీలు అందజేసే నివేదికలతోనే కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే.

 

కాగా, ఈ విధానంతో పరిపాలనలో పూర్తి పారదర్శకత ఉండదని భావించిన నరేంద్ర మోడీ సర్కారు దీనికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి శాఖా పరంగానే వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు