మానవ వ్యర్థాలతో ఆహారం

24 Aug, 2015 01:23 IST|Sakshi
మానవ వ్యర్థాలతో ఆహారం

వాషింగ్టన్: ‘మిషన్ టు మార్స్’లాంటి అంతరిక్ష ప్రయాణాల్లో వ్యోమగాములు జీవించడానికి అవసరమైన సింథటిక్ ఆహారాన్ని మానవ వ్యర్థాల నుంచి తయారు చేసుకోవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. దీనికిగాను నాసా 20 లక్షల డాలర్లను వారికి బహూకరించింది. క్లెమ్‌సన్ వర్సిటీ కెమికల్, బయో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మార్క్ బ్లెన్నర్ ఈ విధానాన్ని రూపొందించారు. 2030లో అంగారకు డిపైకి మానవుని పంపాలని చూస్తున్న నాసాకు ఈ ఆలోచన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

మానవ వ్యర్థంలోని ఈస్ట్ ద్వారా ఇది సాధ్యవుతుంది.  ఒక ప్రత్యేక జాతికి చెందిన ఈస్ట్ పాలిమర్లను, ప్లాస్టిక్‌లను ఉత్పత్తి చేస్తుందని, ఇది చర్మం, వెంట్రుకల రక్షణకు ఉపయోగపడుతుందని  బ్లెన్నర్ తెలిపారు. కానీ ఈ ఈస్ట్ జీవించాలంటే నత్రజని అవసరమని, మానవుని నిశ్వాసం ద్వారా అందే కార్బన్ డై ఆక్సైడ్ ద్వారా కూడా ఈస్ట్ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు