చంద్రుడిపై నాసా మానవ సహిత ప్రయోగం

12 May, 2017 19:38 IST|Sakshi

వాషింగ్టన్‌: చంద్రుడిపై మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సమాయత్తమవుతోంది. ఏడాదిపాటు చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించేలా ఈ నూతన మిషన్‌ను రూపొందిస్తుంది. 2030లో మార్స్‌ మానవ సహిత ప్రయోగం కంటే ముందే అనగా 2027లోనే ఈ ప్రయోగాన్ని చేపట్టాలని నాసా భావిస్తోంది.

మార్స్‌ ప్రయోగానికి అవసరమయ్యే సాంకేతికతను పరీక్షించేందుకు చంద్రుడి చుట్టూ ‘డీప్‌ స్పేస్‌ గేట్‌వే’ను నిర్మించనుంది. దీనినే మార్స్‌పైకి చేసే ప్రయోగానికి లాంచింగ్‌ పాయింట్‌గా ఉపయెగించుకోనున్నామని నాసాలోని హ్యూమన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మిషన్‌ డిప్యూటీ అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌ గ్రేగ్‌ విలియమ్స్‌ తెలిపారు. ఈ లునార్‌ మిషన్‌లో మొత్తం ఐదు సహ ప్రయోగాలు ఉంటాయని, వీటిలో నాలుగు సిబ్బందికి అవసరమైన హార్డ్‌వేర్‌ను అందిస్తుందని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు