ఇద్దరు యువ శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు

17 Jul, 2017 02:59 IST|Sakshi
కేంద్ర మంత్రి నుంచి అవార్డు అందుకున్న శాస్త్రవేత్తలు సతేంద్రకుమార్‌, శైలజా

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో పరిశోధనలకుగానూ విశేష కృషి చేస్తున్న ఇద్దరు యువ శాస్త్రవేత్తలకు జాతీయ అవార్డులు దక్కాయి. ఆహారోత్పత్తి పంటలు, హార్టికల్చర్‌ సైన్స్‌ విభాగంలో పరిశోధనలకుగానూ హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌ (ఐఐఆర్‌ఆర్‌)లో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఎం.సతేంద్రకుమార్‌కు లాల్‌బహదూర్‌ శాస్త్రి యువ శాస్త్రవేత్త అవార్డు దక్కింది.

అలాగే బయోటెక్నాలజీ విభాగంలో డాక్టోరల్‌ థీసెస్, అల్‌లైడ్‌ సైన్స్‌లో పరిశోధనలకుగానూ పటాన్‌చెరులోని ఐసీఆర్‌ఐఎస్‌ఏటీలో పనిచేస్తున్న యువ శాస్త్రవేత్త డా.బి.శైలజాకు జవహార్‌లాల్‌ నెహ్రు అవార్డు వరించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ ఈ అవార్డులు వారికి అందజేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో పరిశోధనలు చేస్తున్న యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.

మరిన్ని వార్తలు