'మలాలా' దేశ గౌరవానికి ప్రతీక : నవాజ్ షరీఫ్

12 Oct, 2013 15:30 IST|Sakshi
'మలాలా' దేశ గౌరవానికి ప్రతీక : నవాజ్ షరీఫ్

మలాలా యుసఫ్జాయ్ పాకిస్థాన్ దేశ గౌరవానికి ప్రతీక అని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అభివర్ణించారు. శనివారం ఇస్లామాబాద్లో డైలీ టైమ్స్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఐరోపా పార్లమెంట్ మానవ హక్కుల కోసం కృషి చేసినవారికి అందించే షకరోవా పురస్కారానికి మలాలా ఎంపిక కావడం పట్ల విలేకర్లు అడిగిన ప్రశ్నకు నవాజ్ షరీఫ్పై విధంగా స్పందించారు. ఈ సందర్బంగా మలాలాను నవాజ్ షరీఫ్ పొగడ్తలతో ముంచెత్తారు. తమ దేశానికి మలాలా ఓ అణిముత్యమని పేర్కొన్నారు. యువతరానికి, రాబోయే తరాలకు స్ఫూర్తి అని తెలిపారు.  


ఆమెను చూసి దేశం గర్విస్తుందని చెప్పారు. పాక్లో బాలికల విద్య కోసం ఆమె చేస్తున్న పోరాటంపై ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం యూఎస్లో ఉన్న మలాలా ఆ దేశాధ్యక్షుడు ఒబామా ఆయన భార్య మిషెల్తో భేటీ అయింది. ఈ సందర్భంగా మలాలాను ఒబామా దంపతులు ఘనంగా సత్కరించారు.   పాక్లో బాలికల విద్య కోసం ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ ఆమె చేస్తున్న పోరాటాన్ని ఒబామా దంపతులు ఈ సందర్భంగా కొనియాడారు.

 

పాక్లో చిన్నారి బాలికల విద్య కోసం తాలిబన్లను సైతం ఎదురించింది. ఆ క్రమంలో తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది.  మెరుగైన వైద్య చికిత్స కోసం పాక్ ప్రభుత్వం మలాలాను బ్రిటన్కు తరలించింది. అక్కడ మలాలా ఆరోగ్యం కుదుటపడింది. మలాలాతోపాటు ఆమె తండ్రి బ్రిటన్లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా