తపస్ పాల్ ను బహిష్కరించండి

1 Jul, 2014 20:31 IST|Sakshi

న్యూఢిల్లీ: సీపీఎం కార్యకర్తలను బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని జాతీయ మహిళా సంఘం డిమాండ్ చేసింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన మహిళా సంఘం పాల్ ను నోటీసు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. పాల్ పై మమతా బెనర్జీ చర్య తీసుకోవాలని జాతీయ మహిళా సంఘం అధ్యక్షురాలు మమత శర్మ డిమాండ్ చేశారు.

తమ పార్టీకి చెందిన ఒక్క కార్యకర్తపై దాడి జరిగినా.. ప్రతిపక్ష సీపీఎం కార్యకర్తలను హతమారుస్తామని, వారి మహిళలపై అత్యాచారాలు చేయాలని తమ కార్యకర్తలకు పురికొల్పుతానని సీపీఎం నేతలను హెచ్చరిస్తూ తపస్ పాల్ చేసిన ప్రసంగం తాలూకూ వీడియోను ఓ స్థానిక టీవీ చానల్ ప్రసారం చేయడంతో ఆయనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.

>
మరిన్ని వార్తలు