'తెలుగు రాష్ట్రాలు రెండూ వెనకబడ్డాయి'

1 Apr, 2015 17:38 IST|Sakshi
'తెలుగు రాష్ట్రాలు రెండూ వెనకబడ్డాయి'

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ఎన్డీఏ ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు హామీయిచ్చారు. బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి గతేడాదికి సంబంధించి రూ.250 కోట్లు నిధులు విడుదల చేశామని తెలిపారు. మార్చి 31లోగా ఈ నిధులు రాష్టానికి అందేలా చూశామన్నారు.

విజయవాడ, గుంటూరు నగరాల్లో ముఖ్య సమస్యలను గుర్తించామని చెప్పారు. విజయవాడలో సముద్ర, భూగర్భ కాల్వల నిర్వహణకు రూ. 461 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. పోలవరంకు అన్ని అవరోధాలు తొలగిపోయాయని చెప్పారు. ఏపీకి న్యాయం జరగకుండానే విభజన జరిగిపోయింది. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అధ్యయన బృందం నివేదిక ఇచ్చిందన్నారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రం హామీయిచ్చిందని తెలిపారు.

విభజన సమస్యల కారణంగా 2013-15లో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని వెల్లడించారు. కేంద్ర నిధులు కూడా వినియోగించుకోలేకపోయాయని వెంకయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు