ఆ గేమ్స్ లో మహిళలే మహరాణులట!

14 Jul, 2016 10:39 IST|Sakshi
ఆ గేమ్స్ లో మహిళలే మహరాణులట!

మహిళలు బుల్లితెరకే కాదు..ఇటు స్మార్ట్ ఫోన్లలో గేమ్స్  కు  కూడా దాసోహమంటున్నారట. మొబైల్  గేమింగ్  లో మహిళలే తమ హవా కొనసాగిస్తున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ డివైజ్ లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన స్మార్ట్ ఫోన్లలో మహిళలే ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారని ఫేస్ బుక్ అధ్యయనంలో బయటపడింది. 12 దేశాల్లో జరిపిన సర్వేలో, దాదాపు సగం మంది అంటే 47శాతం మహిళలు స్మార్ట్ ఫోన్ ప్లేయర్లుగా ఉన్నారని తెలిపింది. మహిళల్లో గేమింగ్ డివైజ్ గా స్మార్ట్ ఫోన్లు మరింత పాపులర్ అవుతున్నాయని ఫేస్ బుక్ స్టడీ పేర్కొంది. నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, మిడిల్-ఈస్ట్, ఆసియా లో 18 వయసుకు పైబడిన ప్రజల్లో ఈ సర్వే నిర్వహించింది. సగటున 71శాతంతో గేమింగ్ డివైజ్ గా స్మార్ట్ ఫోన్ ముందంజలో ఉందని ఫేస్ బుక్ స్టడీ వెల్లడించింది.

దాని తర్వాతి స్థానాల్లో 64శాతంతో కంప్యూటర్లు, 34శాతంతో టాబ్లెట్లు, 26శాతంతో వీడియో గేమ్ కంసోల్స్ ఉన్నాయని యాడ్ వీక్.కామ్ రిపోర్టు  మంగళవారం నివేదించింది. ఎవరైతే మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నారో వారి అలవాట్లపై కూడా సర్వే విశ్లేషించింది. కనీసం నెలకి ఓసారైనా వారు గేమ్స్ కోసం నగదు ఖర్చుచేస్తున్నారని సర్వే పేర్కొంది.  సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా గేమ్స్ ను ఎక్కువగా తెలుసుకుని, సమయాన్ని ఫోన్లలో ఆటలు ఆడటానికి సద్వినియోగం చేస్తున్నామని సగటున 68శాతం మొబైల్ గేమ్ ఆటగాళ్లు చెప్పారు. ఫోటో, వీడియో సర్వీసులు 57శాతం, చాట్ యాప్స్ 54శాతం గేమ్స్ కనుగొనటానికి పాపులర్ సోర్స్ గా తోడ్పడుతున్నాయని రిపోర్టు నివేదించింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులు ద్వారా డిజిటల్ గేమ్స్ ను తెలుసుకోవడం 34శాతమని మొబైల్ గేమ్ స్పెండర్లు చెప్పారు.

మరిన్ని వార్తలు