సమైక్యాంధ్ర కోసం వీధుల్లోకి రావక్కర్లేదు: కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్

7 Oct, 2013 20:29 IST|Sakshi

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనపై పునరాలోచనకు అవకాశమే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ అన్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలేమైనా ఉంటే మంత్రుల బృందానికి చెప్పాలని, వీధుల్లోకి రావాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపిన కొన్ని పార్టీలు ఇప్పుడు సీమాంధ్రలో జరుగుతున్న హింసాత్మక ఆందోళనలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినా సరే, ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ను విభజించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసే ప్రతిపాదనపై పునరాలోచన చేయబోదని స్పష్టం చేశారు.

సమైక్యాంధ్ర ఆందోళనలకు ఒక పార్టీ సారథ్యం వహిస్తోందని, ఆ పార్టీ గతంలో రాష్ట్ర విభజనకు ఆమోదించిందని సింగ్ వ్యాఖ్యానించారు. ఇది చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షించే ఏర్పాట్లు మాత్రం తగినంతగానే ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసే ప్రయత్నాలను కఠినంగా ఎదుర్కొంటామని సింగ్ అన్నారు.

మరిన్ని వార్తలు