‘నేను శక్తి’ వేడుకలు

2 Mar, 2018 02:32 IST|Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నేను శక్తి’ వేడుకలు

‘నేను శక్తి’. స్త్రీలు తరతరాల అంతరాలను దాటుకుని, తమలో దాగున్న అనంత శక్తిని యావత్‌ ప్రపంచానికి చాటాలన్న సమున్నత లక్ష్యంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం. అసమానతల్ని అధిగమించి ఇంటా బయటా, సమాజ ప్రగతికి సంబంధించిన ప్రతి మలుపులోనూ తనదైన ముద్రవేసిన మహిళా మణులెందరినో మనసారా స్మరించుకునే ఘట్టం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షిస్తూ, సిసలైన మహిళాభ్యున్నతి భావనను ‘సాక్షి’ సొంతం చేసుకున్న అపురూప సందర్భం. స్త్రీలు ఆజన్మాంతం ఎదుర్కొంటున్న సవాళ్ళను సవివరంగా చర్చించి, పరిష్కార మార్గాలను అన్వేషించి, మహిళా సాధికారతను మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ సాగింది ‘సాక్షి’. ఈ క్రతువులో నెల రోజుల పాటు అందించిన, అందిస్తున్న కథనాలు, కథలు, వాస్తవికతలను పాఠకలోకం ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. నిండు మనసుతో సొంతం చేసుకుంది.

సమానత్వ సాధనకు ‘సాక్షి’ చేపట్టిన లింగ వివక్ష వ్యతిరేకోద్యమంలో అశేష పాఠకులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను నిలదీస్తూ, వారి మధ్య సమానత్వ సాధన దిశగా ‘సాక్షి’ వేసిన ఈ ముందడుగును మేధావులు, కవులు, రచయిత్రులు, ప్రజాస్వామికవాదులెందరో హృదయపూర్వకంగా అభినందించారు.

‘నేను శక్తి’ ప్రచారోద్యమంలో మొదట లింగ వివక్ష, గృహ హింస, లైంగిక వేధింపులు, సాధికారత... ఈ నాలుగు అంశాలపై ‘సాక్షి’ విçస్తృతంగా చర్చించింది. తమ అమ్మాయిలను వివక్షను ఎదిరించి నిలిచే ధీరవనితలుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ‘సూపర్‌ పేరెంట్స్‌’గా సత్కరించుకునేందుకు, సంబంధిత కథనాలతో కూడిన 10 నిమిషాల నిడివి గల ‘షార్ట్‌ ఫిల్మ్‌’లను ఆహ్వానించింది. ఇందుకు పాఠక లోకం నుంచి విశేష స్పందన లభించింది.

అందిన ఎంట్రీల్లోంచి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నేను శక్తి’ ముగింపు వేడుకల్లో సముచితంగా సత్కరించాలని భావిస్తున్నాం. ఈ నెల 7న హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే ‘నేను శక్తి’ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మీ అందరికీ ఇదే సాదర ఆహ్వానం. వేడుకల్లో పాల్గొనేందుకు 95055 55020కు ఫోన్‌ చేసి పేరు నమోదు చేయించుకోగలరు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నతల్లి కర్కశత్వం

ఆ ర్యాంకింగ్స్‌లో కేరళ టాప్‌..!

పెట్టుబడి నిర్ణయాల్లో...మహిళలూ ముందుండాలి..

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఈ సారి నినాదం # ప్రగతి కోసం పట్టు

నేను శక్తి స్వరూపం

ఆర్థిక రంగం ఆణిముత్యాలు

సాధ్వీమణులకు వందనం..

ఆత్మ విశ్వాసమే.. వారి గెలుపు గీతం

ఆకాశమే హద్దుగా...

ఈ బ్యాక్టీరియా మంచిదే!

ఖాతా ఉపయోగించడం లేదా..?

కెనడాలో ఉగ్రదాడి!

ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పెంపు

‘శంకర్‌-కమల్‌-దిల్‌ రాజు’ కాంబో మూవీకి సైన్‌

టుడే న్యూస్‌ అప్ డేట్స్‌

టుడే న్యూస్ అప్ డేట్స్‌

అందుకే రాజమౌళి సాయం కోరా: చంద్రబాబు

పెళ్లంటే భయమా? ఇదిగో సర్కారు మంత్రం..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

‘టీఆర్‌ఎస్‌ భవన్‌కు టులెట్‌ బోర్డు’

కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం

ఎన్‌డీటీవీని అమ్మేశారా?

వీఐపీ సంస్కృతికి 650 మంది బలి

భారత్‌పై వాడేందుకే..!

హనీప్రీత్‌ ఎక్కడుందో నాకు తెలుసు: నటి

అమెరికాలో కాల్పుల కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?