బృహత్ శిలాయుగపు సమాధులు....

21 Jul, 2015 02:13 IST|Sakshi
బృహత్ శిలాయుగపు సమాధులు....

పుల్లూరులో పురావస్తుశాఖ తవ్వకాల్లో గుర్తింపు
 
మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూర్ శివారులో పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో రోజురోజుకూ ఆసక్తికర  వస్తువులు లభ్యమవుతున్నాయి.  సోమవారం బృహత్ శిలాయుగపు సమాధులు 50 వరకు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా బండలపై గ్రైడింగ్ గ్రూవ్స్ గుర్తించామని వీటిని నవీన శిలా యుగంలో 4,500 సంవత్సరాల క్రితం వాడి ఉంటారని చెబుతున్నారు.

గ్రైడింగ్ గ్రూవ్స్‌ను రాతి గొడ్డళ్లను నూరేందుకు వాడతారని పురావస్తు శాఖ సాంకేతిక సహాయకులు టి.ప్రేమ్‌కుమార్ పేర్కొంటున్నారు. కాగా శిలాయుగపునాటి సమాధుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో మరిన్ని రకాల వస్తువులు బయటపడే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు.
-సిద్దిపేట రూరల్
 

మరిన్ని వార్తలు