'మోదీ మా దేశం రాండి.. మాట్లాడండి'

11 Jun, 2015 18:08 IST|Sakshi
'మోదీ మా దేశం రాండి.. మాట్లాడండి'

న్యూఢిల్లీ: నేపాల్కు భారత ప్రధాని నరేంద్రమోదీని ఆదేశ ప్రధాని సుశీల్ కోయిరాలా ఆహ్వానించారు. తమ వద్ద జరుగుతున్న తొలి డోనర్స్ సమావేశంలో పాల్గొని అందులో ప్రసంగించాల్సిందిగా ఆయన చెప్పారు. ఈ మేరకు గురువారం మోదీకి సుశీల్ నేరుగా ఫోన్ చేయడమే కాకుండా ప్రత్యేక ఆహ్వాన పత్రికతో నేపాల్ ఆర్థిక మంత్రి రామ్ చంద్ర మహత్ ను కూడా ఢిల్లీ పంపించనున్నారు. జూన్ 25న ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కొయిరాలా మోదీని పొగడ్తల్లో ముంచెత్తారు. పొరుగు దేశాలతో మోదీ భారత్కు బలపరుస్తున్న సంబంధాలు అద్వితీయం అని చెప్పారు. బంగ్లాదేశ్ పర్యటన కూడా ఆయన ప్రస్థావించారు.

దీంతోపాటు భూకంప బారినుంచి త్వరగా కోలుకునేందుకు తీసుకుంటున్న సహాయక చర్యలను కూడా ఆయన మోదీకి వివరించారు. అయితే, తాను తప్పక వస్తానని హామీ ఇచ్చిన మోదీ ఏదైనా కారణాల వల్ల రాలేకపోతే మాత్రం ఉన్నత స్థాయి కమిషన్ వస్తుందని చెప్పినట్లు సమాచారం. చక్కటి వాక్చాతుర్యం ఉన్న నేత నరేంద్ర మోదీకావడంతో ఆయనే వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా, భూకంపం బారిన పడిన నేపాల్కు అన్ని విధాల సాయం అందించిన దేశాల్లో భారత్ ముందున్న నేపథ్యంలో కూడా మోదీనే వెళ్లొచ్చు. భూకంపం బారిన పడిన తమకు సహాయం చేసిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపే ఉద్దేశంతో నేపాల్ ఈ సమావేశం నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు