'అడ్డగోలుగా ఎస్ బీఐ చార్జీలు'

6 Mar, 2017 14:52 IST|Sakshi
'అడ్డగోలుగా ఎస్ బీఐ చార్జీలు'

భారతీయ స్టేట్ బ్యాంకు ప్రవేశపెట్టిన చార్జీలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎస్ బీఐ చార్జీలు, సర్వీసు రుసుములు పునరుద్ధరించడం బ్యాకింగ్ చరిత్రలో బ్లాక్ డేగా వర్ణించారు. ప్రభుత్వ బ్యాంకు చర్యలు పేదలు, మధ్య తరగతి వారికి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్పీజీ సిలెండర్ రూ. 86, ఏటీఎం లావాదేవిలపై రూ. 150, కనీస నిల్వ పెనాల్టీలతో సామాన్య జనంపై భారం మోపారని తెలిపారు. ఎస్ బీఐ అన్యాయంగా చార్జీలు పెంచిందని వాపోయారు. కనీస నిల్వను తప్పనిసరి చేసిన ఎస్ బీఐపై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బీఐ) ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. కొత్తగా ప్రవేశపెట్టిన రుసుములతో ఖాతాదారులకు ఎదురుదెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'మూడు సార్లు నగదు ఉపసంహరించుకుంటే ఎందుకు చార్జీలు వసూలు చేస్తారు? ఇందుకేనా ఖాతాలు తెరిచింద'ని మరొకరు ఆవేశంగా ప్రశ్నించారు. 'ముందుగా పౌరులందరినీ బ్యాకింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు చార్జీలు మోత మోగించారు. ఆర్థిక సామ్రాజ్యవాదానికి స్వాగతం' అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు.

బ్యాంకుల్లో నగదు జమ చేసేలా ప్రజలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని, ఇప్పుడు ప్రజల ధనంపై చార్జీలు, సర్వీసు రుసుములు విధించిందని మరొకరు పేర్కొన్నారు. ఎస్ బీఐ ప్రవేశపెట్టిన చార్జీలు అడ్డగోలుగా ఉన్నాయని, ఆలోచించేవారంతా దీనిపై పోరాటం చేయాలని మరొకరు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6న నో ట్రాన్సక్షన్ డేగా పాటించి నిరసన తెలపాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుంది.

మరిన్ని వార్తలు