ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

24 Aug, 2015 00:40 IST|Sakshi
ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

లండన్: మీరు అర్జెంట్‌గా ఫోన్ మాట్లాడుతున్నారు. అదే సమయంలో బ్యాటరీ చార్జ్ అయిపోయి ఫోన్ ఆఫ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? చేతిలో ఉన్న ఫోన్‌ను తీసి విసిరి కొట్టాలనిపిస్తోంది కదా! అయితే మీలాంటి వారి కోసమే కేవలం ఆరే ఆరు నిమిషాల్లో ఫుల్ చార్జ్  అయ్యే బ్యాటరీ ఉందండి.  అల్యూమినియంతో నిండిన క్యాప్సుల్స్ మీ సెల్‌ఫోన్‌ను ఆరు నిమిషాల్లో చార్జ్ చేస్తుంది. ప్రస్తుతమున్న లిథియం అయాన్ బ్యాటరీ కంటే దీనికి 4 రెట్లు సామర్థ్యం అధికంగా ఉండడమే కాదు, చార్జింగ్ తర్వాత ఎక్కువ సమయం వాడుకునే వీలుంటుంది.

లిథియం బ్యాటరీలో అల్యూమినియం వాడకం విషయంలో తలెత్తిన సమస్యలను అధిగమిస్తూ  బీజింగ్‌లోని మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సింగ్వా యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఇందులో  అల్యూమినియం చుట్టూ టైటానియం డై ఆక్సైడ్ కవచం ఉంటుంది. ఈ కవచం బ్యాటరీ రుణాత్మక ఎలక్ట్రోడ్‌గా పనిచేస్తుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలర్స్‌ సంక్రాంతి

‘విధి’ విజయం సాధించాలి

అనుకోని అతిథి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంజలి చాలా నేర్పించింది!

అరేబియన్‌ రాజ్యంలో...

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను