ఉపగ్రహాన్ని పంపిన తొలి ప్రైవేటు రాకెట్

5 Dec, 2013 06:08 IST|Sakshi
ఉపగ్రహాన్ని పంపిన తొలి ప్రైవేటు రాకెట్

వాషింగ్టన్: ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ప్రైవేటు సంస్థ రూపొందించిన రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. దక్షిణాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోని టీవీ చానెళ్లకు సేవలందించేందుకు రూపొందించిన ‘సెస్-8’ ఉపగ్రహాన్ని అమెరికా ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ ప్రయోగించింది.
 
 3.2 టన్నుల బరువున్న ఈ శాటిలైట్‌ను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కేప్ కెనరవాల్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పంపారు. ప్రయోగం ప్రారంభమైన 185 సెకన్లలోనే రాకెట్ ‘సెస్-8’ను 295 ఁ 80,000 కిమీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. కాగా, తాము మొట్టమొదటిసారిగా వాణిజ్య పరంగా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపామని.. మరో 50 ఉపగ్రహాలను పంపేందుకు ప్రణాళికలు ఉన్నాయని స్పేస్‌ఎక్స్ సంస్థ సీఈవో ఎలోన్ మస్క్ చెప్పారు.
 

మరిన్ని వార్తలు