పేద్ద నోట్లు వచ్చాయ్

11 Nov, 2016 01:35 IST|Sakshi
ముందు వైపు.. 
రూ. 500

  
 1.    లైటు వెలుతురులో 500 అంకెను గమనించవచ్చు
 2. 45 డిగ్రీల కోణంలో చూస్తే 500 అంకెను గమనించొచ్చు
 3. దేవనాగరి లిపిలో 500 సంఖ్య.
 4. మధ్య భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ
 5. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చనుంచి నీలంకు మారుతుంది. మధ్యలో భారత్, ఆర్బీఐ, 500 అంకె ఉంటుంది. 
 6. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్చారు. 
 7. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్(500) వాటర్‌మార్క్
 8. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది.
 9. కుడివైపున కిందిభాగంలో రంగు మారే ఇంక్(ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపాయి చిహ్నంతోపాటు సంఖ్యల్లో డినామినేషన్ ఉంటుంది.
 10. కుడివైపున అశోక స్తూపం చిహ్నం 
 అంధుల కోసం: మహాత్మా గాంధీ బొమ్మ, అశోక స్థూపం చిహ్నం, నల్ల గీతలు, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటారుు.
 11. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన రూ.500 ఉన్న వృత్తం
 12. కుడి, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఐదు నల్ల గీతలు
 వెనుకవైపు..
 13. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది.
 14. స్వచ్ఛభారత్ లోగో
 15. అధికార భాషలు
 16. భారత వారసత్వ ప్రదేశం ఎర్రకోటపై జాతీయ జెండా
 17. కుడివైపున దేవనాగరి లిపిలో రూ.500 సంఖ్య

 ముందువైపు..
 రూ.  2000 

 
1.
లైటు వెలుతురులో 2000 అంకెను గమనించవచ్చు
 2. 45 డిగ్రీల కోణంలో చూస్తే 2000 అంకెను గమనించొచ్చు
 3. దేవనాగరి లిపిలో రూ.2000 సంఖ్య
 4. మధ్య భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ
 5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000
 6. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చనుంచి నీలానికి మారుతుంది.మధ్యలో భారత్, ఆర్బీఐ, 2000 అంకె ఉంటుంది.
 7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్పు
 8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్(2000) వాటర్‌మార్క్
 9. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది.
 10. కుడివైపున కింది భాగంలో రంగు మారే ఇంక్ (ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపారుు సింబల్‌తోపాటు 2000 సంఖ్య. 
 11. కుడివైపున అశోక స్తూపం చిహ్నం
 అంధుల కోసం: మహాత్మా గాంధీ బొమ్మ, అశోక స్థూపం చిహ్నం, నల్ల గీతలు, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటారుు
 12. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన 2000 ఉన్న దీర్ఘచతురస్రాకారం
 13. కుడి, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఏడు నల్ల గీతలు
 వెనుకవైపు
 14. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది.
 15. నినాదంతో సహా స్వచ్ఛభారత్ లోగో
 16. అధికార భాషలు
 17.‘మంగళయాన్’ చిత్రం
 
 
>
మరిన్ని వార్తలు