-

ఉద్యోగస్తుల భాగస్వామ్యంతోనే కొత్త ఆవిష్కరణలు

30 Oct, 2013 02:15 IST|Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్యోగస్తుల భాగస్వామ్యంతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని మేనేజ్‌మెంట్ గురు డాక్టర్ రుషీకేశ టి. కృష్ణన్ పేర్కొన్నారు. ఇలా ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేసిన టయోటా, కాగ్నిజెంట్ వంటి సంస్థలు అనేక కొత్త ఆవిష్కరణలు ద్వారా వ్యాపారంలో విజయం సాధించాయన్నారు. కాని ఈ విషయంలో ఇండియా చాలా వెనకబడి ఉందని, అంతర్జాతీయ ఇన్నోవేటివ్ ఇండెక్స్‌లో 66వ స్థానంలో ఉన్నామన్నారు.
 
 మంగళవారం హైదరాబాద్‌లో ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఎల్‌వో) ఏర్పాటు చేసిన ‘ఇన్నోవేషన్... గోయింగ్ బియాండ్ జుగాద్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో కృష్ణన్ మాట్లాడుతూ టయోటా ఉద్యోగస్తులు గత 40 ఏళ్ళలో 2 కోట్లకు పైగా ఇన్నోవేటివ్ ఐడియాలను ఇవ్వగా, 2012 ఒక్క సంవత్సరంలోనే కాగ్నిజెంట్ ఉద్యోగస్తులు 1.34 లక్షల ఐడియాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు. మన ఇండియాలో టైటాన్ ఇటువంటి కార్యక్రమాన్నే చేపట్టి అనేక విజయాలను సాధిస్తోందని, 2015 నాటికి ప్రతీ ఉద్యోగి ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకుందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. పేర్కొన్నారు. మన ఇండియాలో టైటాన్ ఇటువంటి కార్యక్రమాన్నే చేపట్టి అనేక విజయాలను సాధిస్తోందని, 2015 నాటికి ప్రతీ ఉద్యోగి ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకుందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు