ఆ హీరోయిన్‌పై సొంతూరిలోనే వెలివేత!

12 Sep, 2016 11:15 IST|Sakshi
ఆ హీరోయిన్‌పై సొంతూరిలోనే వెలివేత!

బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత సన్నీ లియోన్‌ ఇమేజ్‌ మారిపోయింది. నటిగా విజయం సాధించిన ఆమె మోస్ట్‌ ఫేమస్‌ ఇండియన్‌-కెనడియన్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇటు భారత్‌లో, అటు కెనడాలో ఆమెను అంగీకరిస్తున్నప్పటికీ.. సొంతూరిలో మాత్రం ఆమె పట్ల విముఖత వ్యక్తమవుతోంది. ఆమె గురించి మాట్లాడటానికి కూడా ఎవరూ ముందుకురావడం లేదు. ఆమెపై ఒక రకమైన సాంఘిక బహిష్కరణ భావం అక్కడ వ్యక్తమవుతుండటం గమనార్హం.

తాజాగా సన్నీ లియోన్‌ జీవితంపై 'మోస్ట్‌లీ సన్నీ' పేరిట ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ఈ డాక్యుమెంటరీలో ఆమె గురించి మాట్లాడేందుకు సొంతూరు వాసులు ఒక్కరూ ముందుకురాలేదు. కెనడియన్‌ ఒంటారియో ప్రావిన్స్‌లోని సార్నియా పట్టణంలో సన్నీ 35 ఏళ్ల కిందట జన్మించింది. ఆమె అసలు పేరు కెరెన్‌జిత్‌ కౌర్‌ వోహ్రా. సంప్రదాయ సిక్కు కుటుంబంలో పుట్టిన ఆమె పెంట్‌హౌస్‌ పెట్‌గా కనిపించి పేరు సాధించింది. ఆ తర్వాత పోర్న్‌స్టార్‌గా మారిన ఆమె గురించి ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ దిలీప్‌ మెహతా రూపొందించిన ఈ డాక్యుమెంటరీని తాజాగా టోరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు.

సన్నీ లియోన్‌ను బాలీవుడ్‌ నటిగా ఇప్పుడు చాలామంది అంగీకరిస్తున్నారు. పెళ్లిళ్లు, వేడుకలు వంటి వాటికి పిలిచి ఆమెతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. కానీ ఆమె సొంతూరైన సార్నియాలోని భారత సంతతి కెనడియన్లు మాత్రం ఆమె పేరు ఎత్తితే చిరాకు పడుతున్నారు. ఈ డాక్యుమెంటరీలో ఆమె గురించి మాట్లాడటానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదని, ఆమెను వారు ఏమాత్రం అంగీకరించడం లేదని ఫిల్మ్ మేకర్‌ దిలీప్‌ మెహతా తెలిపారు.
 

మరిన్ని వార్తలు