కొత్తనోట్లపై నేపాల్ సంచలన నిర్ణయం

12 Dec, 2016 15:07 IST|Sakshi
కొత్తనోట్లపై నేపాల్ సంచలన నిర్ణయం
భారత్ ఇటీవల రద్దుచేసిన రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకోవడంలో నేపాలీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో  ఆ దేశ సెంట్రల్ బ్యాంకు గురువారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్ తాజాగా విడుదల చేస్తున్న కొత్త నోట్లు రూ.500, రూ.2,000ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద భారత రిజర్వు బ్యాంకు కొత్త నోటిఫికేషన్ జారీచేయనంత వరకు భారత కొత్త కరెన్సీ నోట్ల ఎక్స్చేంజ్ ఉండద్దని నేపాల్ రాష్ట్ర బ్యాంకు తేల్చి చెప్పింది. ఈ నోటిఫికేషన్ వల్ల విదేశీ దేశాల పౌరులు భారత కరెన్సీని నిర్దిష్ట మొత్తంలో కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుందని ఆ దేశ అధికారులు చెప్పారు. భారత వైపు నుంచి కొత్త ఏర్పాట్లు వచ్చేంతవరకు, భారత కొత్త కరెన్సీని చట్టవిరుద్ధమైనవిగానే పరిగణించాలని, వాటిని ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉండదని తూర్పు ప్రాంతానికి చెందిన నేపాల్ రాష్ట్ర బ్యాంకు చీఫ్ రాము పౌడెల్ చెప్పారు.
 
ఇప్పటికీ భారత్ రద్దుచేసిన పాత కరెన్సీ నోట్లపై నేపాల్లో అనిశ్చిత కొనసాగుతుందని, ఈ సమయంలో కొత్త కరెన్సీ నోట్లను ఎలా మార్కెట్లోకి చట్టబద్దమైనవిగా అనుమతించాలని ప్రశ్నించారు. నేపాల్లో భారత కరెన్సీని విరివిగా వాడుతారని, చాలామంది ప్రజల దగ్గర రూ.500, రూ.1000నోట్లు ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సంబంధాలతో పాటు, వివిధ కార్యకలాపాలతో భారత కరెన్సీని నేపాల్ లోకి ప్రవేశిస్తుంటుందని చెప్పారు. నేపాల్ ప్రజలు భారీ మొత్తంలో భారత్ రద్దుచేసిన నోట్లను వాడుతుంటారని, నోట్ల బ్యాన్తో వారు ఇబ్బందులు పడుతున్నట్టు ఆ దేశం ఇప్పటికీ భారత్కు విన్నపించిన సంగతి తెలిసిందే. తమకు నోట్లు మార్చుకోవడానికి సరియైన ఏర్పాట్లు చేయాలని ఆ దేశ సెంట్రల్ బ్యాంకు, మనదేశ ప్రభుత్వాన్ని, ఆర్బీఐను కోరింది.  
 
>
మరిన్ని వార్తలు