రాష్ట్రప్రభుత్వానికి ఉత్తరాఖండ్ గవర్నర్ కృతజ్ఞతలు

14 Nov, 2013 05:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉత్తరాఖండ్ గవర్నర్ డాక్టర్ అజీజ్ ఖురేషీ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. గత జూన్‌లో భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్లకల్లోమైన సందర్భంలో రాష్ట్రప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించినందుకుగాను ఆయన సీఎం  కిరణ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో రూ.50 కోట్లు ప్రకటించింది. ఇందులో రూ.10 కోట్లు ప్రభుత్వానికి ఆర్థిక సాయంగా,  మిగతా డబ్బుతో టీటీడీ ఆధ్వర్యంలో మూడు సత్రాల నిర్మాణానికి, యాత్రికులకు వసతులు కల్పించేందుకు అందజేసింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు