కేజ్రీవాల్ పై షూ విసిరాడు

1 Jan, 2017 18:45 IST|Sakshi
కేజ్రీవాల్ పై షూ విసిరాడు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం షూ విసిరేశాడు. హర్యానా రాష్ట్రంలోని రోహ్ తక్ జిల్లాలో ఆప్ నిర్వహస్తున్న ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధిక విలువ కలిగిన నోట్ల రద్దు పెద్ద కుంభకోణం అని ర్యాలీలో ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో దుండగుడు కేజ్రీపై షూ విసిరాడు. దీంతో ఒక్కసారిగా ర్యాలీలో కలకలం రేగింది. చెప్పు విసిరిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గతంలో కూడా కేజ్రీపై పలుమార్లు దాడులు చేసిన విషయం తెలిసిందే.   
మరిన్ని వార్తలు