రాజమండ్రి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీలో పిటీషన్

15 Jul, 2015 00:46 IST|Sakshi

న్యూఢిల్లీః రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ)లో ఆంధ్రా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరాల నిర్వహణలో విఫలమయ్యారని సంస్థ అధ్యక్షుడు వీర రాఘవరెడ్డి ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ల ప్రత్యేక పూజల కారణంగా క్యూ లైన్లను 3 గంటలపాటు నిలిపివేశారని, దీంతో భక్తులు క్యూ లైన్లు వదిలేశాక ఒక్కసారిగా పుష్కర స్నానాలకు రావడంతో తొక్కిసలాట జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనకు చంద్రబాబు, లోకేష్ సహా 16 మంది కారణంగా చూపుతూ పిటిషన్ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు