ఉగ్రవాది అక్తర్ ఆస్తులను స్వాధీనం చేసుకోనున్న ఎన్‌ఐఏ

1 Dec, 2013 21:36 IST|Sakshi

 పాట్నా: పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది తహసీన్ అక్తర్ అలియాస్ మోను ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగం సిద్ధం చేస్తోంది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా మణియార్‌పూర్ గ్రామానికి చెందిన అక్తర్... ఢిల్లీ, ముంబై, పాట్నా, బుద్ధగయ సహా పలుచోట్ల జరిగిన బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడు.

లొంగుబాటుకు ప్రత్యేక కోర్టు విధించిన గడువు ముగిసిపోయినా, అతడు పోలీసుల ముందుకు రాకపోవడంతో ఎన్‌ఐఏ అతడి ఆస్తులను స్వాధీనం చేసుకోనుందని పోలీసు వర్గాలు తెలిపాయి. అతడి ఆస్తుల స్వాధీనం కోసం ఎన్‌ఐఏ బృందం అతడి స్వగ్రామానికి చేరుకున్నట్లు చెప్పాయి.

>
మరిన్ని వార్తలు