ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

18 Jan, 2017 16:39 IST|Sakshi
ముంబై : గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు వస్తుండటంతో ఈక్విటీ బెంచ్మార్కులు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 21.98 పాయింట్ల లాభంతో 27257.64 వద్ద , నిఫ్టీ 19 పాయింట్ల లాభంలో 8417 వద్ద క్లోజ్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల గరిష్టంలో నమోదైన ఆసియన్ స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడ్ అయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, హెచ్యూఎల్, ఓఎన్జీసీ, మహింద్రా అండ్ మహింద్రా లాభాల్లో కొనసాగగా.. ఎన్టీపీసీ, గెయిల్, హీరో మోటోకార్పొ, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ నష్టాలు గడించాయి.
 
బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.6 శాతం పెరిగాయి. రెండు నెలల కాలంలో బుధవారం ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.5 శాతం పైకి ఎగిసింది. ఎస్ బ్యాంకు, కెనరా బ్యాంకు మంచి లాభాలను పండించాయి. సెన్సెక్స్లో మెటల్ టాప్ సెక్టోరల్ గెయినర్గా నిలిచింది. నాల్కో, హిందాల్కో, వెదంతా, జేఎస్పీఎల్, టాటా స్టీల్ లాభాలతో మెటల్ షేర్లు 2 శాతం పెరిగాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.09 పైసలు పడిపోయి, 68.05గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 18 రూపాయలు పడిపోయి 28,720గా నమోదైంది. 
 
>
మరిన్ని వార్తలు