కోలుకున్న స్టాక్ మార్కెట్లు

3 Nov, 2016 10:53 IST|Sakshi
ముంబై : అంతర్జాతీయంగా నెలకొన్న భయాందోళనతో గురువారం కూడా నష్టాల్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు కొంత తేరుకున్నాయి.  సెన్సెక్స్ 28.58 పాయింట్ల లాభంతో 27,555వద్ద, నిఫ్టీ 11.90 లాభంతో 8,525వద్ద ట్రేడ్ అవుతున్నాయి.  నిన్నటి ముగింపులో 349 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, ప్రారంభంలో 48.92 నష్టపోయి 27,478.30గా, నిఫ్టీ 14.45 పాయింట్ల నష్టంతో 8499.55గా ఎంట్రీ ఇచ్చాయి. ప్రారంభ నష్టాల్లోంచి సెన్సెక్స్, నిఫ్టీలు కోలుకుని ప్రస్తుతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.  ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్ సెన్సెక్స్లో నష్టాల్లో నడుస్తున్నాయి.. బీహెచ్ఈఎల్ మాత్రమే గ్రీన్గా ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఫ్లాట్గా ప్రారంభమైంది. 66.71గా ముగిసిన రూపాయి విలువ గురువారం 66.72గా నమోదైంది. 
 
రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించిన ఫెడరల్ రిజర్వు పాలసీ మేకర్స్ నిర్ణయంతో డాలర్ విలువ పడిపోతోంది.  అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఆరురోజులే గడువు ఉండటం, అక్టోబర్ నెల ఉద్యోగ గణాంకాల రిపోర్టు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఆసియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు అంచనాలు తారుమారు అవుతుండటంతో, ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని ప్రపంచమార్కెట్లలో కలవరం కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు ఇప్పటి వరకూ హిల్లరీ క్లింటన్ గెలుస్తుందన్న అంచనాలతో ఉండగా... తాజా పోల్‌లో డోనాల్డ్ ట్రంప్ హిల్లరీ క్లింటన్‌ను దాటుకుని ముందుకు వచ్చారనే సర్వేలపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టిసారించారు.
మరిన్ని వార్తలు