లాభాల్లో స్టాక్ మార్కెట్లు

24 Mar, 2017 09:46 IST|Sakshi
ముంబై :  దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ తన 9100 లెవల్ను పునరుద్ధరించుకుని, 9111 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 92.48 పాయింట్ల లాభంలో 29,424 వద్ద కొనసాగుతోంది.  ఇంటర్నెట్ సంస్థ టికోనా నెట్ వర్క్స్కు చెందిన 4జీ వ్యాపారాన్ని టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ సొంతం చేసుకోవడంతో, ఈ కంపెనీ షేర్లు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో 2 శాతం పైగా పైకి ఎగిశాయి. ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 1.67 శాతం పెరిగాయి. వాటితో పాటు కోల్ ఇండియా, ఐటీసీలు కూడా లాభపడ్డాయి.
 
మరోవైపు ట్రంప్ ప్రభుత్వం ఒబామాకేర్ బిల్లుకు రీప్లేస్గా తీసుకురాబోతున్న బిల్లుపై ఓటింగ్ ను రిపబ్లికన్ చట్టసభ్యులు వాయిదా వేశారు.  దీంతో  ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఇచ్చిన హామీలను ఆయన నెరవేరుస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఈ సందిగ్ధతతో ఆసియన్ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. అటు  డాలర్ విలువ కూడా నాలుగు నెలల కనిష్టంలో ట్రేడైంది.. డాలర్ కనిష్టంతో రూపాయి మారకం విలువ పుంజుకుని 65.48గా ప్రారంభమైంది. 
మరిన్ని వార్తలు