లాభాల్లో ముగిసిన మార్కెట్లు

4 Oct, 2016 16:11 IST|Sakshi
లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: మంగళవారం నాటి  స్టాక్ మార్కెట్లు  రెపో రేట్ల తగ్గింపును అందిపుచ్చుకున్నాయి.  ఆర్ బీఐ ప్రకటన కోసం వేచి చూసిన దలాల్ స్ట్రీట్ ఆరంభంనుంచీ అప్రతమత్త ధోరణిలో  కొనసాగింది.  ఆర్బీఐ ప్రకటన తర్వాత ఒకదశలో 100 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్  91పాయింట్ల లాభంతో 28,334 వద్ద,నిప్టీ  31పాయింట్ల  లాభంతో 8, 769వద్ద ముగిశాయి.  నిఫ్టీ కీలకమద్దతు8750 స్థాయికి పైన స్థిరంగా ముగిసింది.   దాదాపు అన్ని సెక్టార్లు ముఖ్యంగా ఐటీ, మెటల్స్‌, ఫార్మా, బ్యాంకింగ్‌, రియల్టీ  రంగాల్లో నెలకొన్న కొనుగోళ్ ధోరణితో  లాభాలను ఆర్జించాయి.  మిడ్ క్యాప్ షేర్లు రికార్డుస్థాయి లాభాలను గడించాయి.  ఓఎన్‌జీసీ, గెయిల్‌  టాప్ గెయినర్ గా నిలువగా  టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, టాటా పవర్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌   లాభపడగా,  జీ ఎంటర్ టైన్ మెంట్, కోల్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌, అంబుజా, యాక్సిస్‌, హెచ్‌యూఎల్‌, హిందాల్కో  క్షీణించాయి.
ద్రవ్య పరపతి సమీక్షలో  కీలకమైన వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ 0.25 శాతంమేర తగ్గించడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌వచ్చింది.  అటు డాలర్ మారకపు విలువలో రూపాయి0.03 పైసల లాభంతో 66.55 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ. 51  లాభంతో రూ.30,630 వద్ద ఉంది.

 

మరిన్ని వార్తలు