వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో

3 Nov, 2016 16:46 IST|Sakshi

ముంబై: ఆద్యంతం  ఓలటైల్ గా సాగిన  దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి వరుసగా నాలుగవ రోజు కూడా నష్టాల్లో ముగిశాయి.  అలాగే భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడి తో నిఫ్టీ నాలుగు నెలల కనిష్టానికి చేరింది.  సెన్సెక్స్ 97 పాయింట్లు క్షీణించి 27,430 వద్ద నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 8,485 వద్ద  క్లోజ్ అయ్యాయి.    కీలక మద్దతుస్థాయిలను కోల్పోతున్న నిఫ్టీ    సుమారు నాలుగు నెలల తరువాత మొదటిసారి  8,500   దిగువన ముగిసింది.  చివరికి ఆరంభ నష్టాలనుంచి  మిడ్‌ సెషన్‌లో కోలుకున్నప్పటికీ చివరి అర్థగంటలో పెరిగిన అమ్మకాలతో మళ్లీ  నష్టాల్లోకి జారుకున్నాయి.   
అన్ని  సెక్టార్లూ  నష్టాల్లో ఉండగా, ఎఫ్‌ఎంసీజీ స్వల్పంగా   లాభపడింది.  ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్,  ప్రభుత్వరంగ బ్యాంకింగ్,   ఫార్మా, రియల్టీ, మెటల్స్‌, ఐటీ రంగాలు  నెగిటివ్ గా ముగిశాయి.  గ్రాసిమ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, బీపీసీఎల్‌, అరబిందో, టాటా స్టీల్‌, స్టేట్‌బ్యాంక్‌, బీవోబీ, ఎన్‌టీపీసీ  నష్టపోగా,  అదానీ పోర్ట్స్ టాప్ లూజర్ గాఅహిందాల్కో 4 శాతం లాభపడి టాప్ గెయినర్ గా నిలిచింది.   ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, ఏసీసీ, హీరోమోటో, భెల్‌, గెయిల్‌, టీసీఎస్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచడీఎఫ్‌సీ బ్యాంక్‌  లాభపడ్డాయి.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి  ఒక పైసా నష్టంతో 66.71వద్ద ఉంది. అయితే బంగారం ధరలుమాత్రం వెలవలబోయాయి.  ఇటీవలి లాభాల నేపథ్యంలో ప్రాఫిట్  బుకింగ్ కారణంగా ఎంసీఎక్స్  మార్కెట్ లో 312 రూపాయల నష్టంతో పది గ్రా.పుత్తడి రూ. 30,354వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు