భారీగా మూతపడుతున్న నైక్ స్టోర్స్

20 Sep, 2016 14:06 IST|Sakshi
భారీగా మూతపడుతున్న నైక్ స్టోర్స్

ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ నైక్ దేశంలో భారీ ఎత్తున తన దుకాణాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించిందట. ఇటీవలి  భారీ నష్టాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ మేకర్ అమెరికాకు చెందిన  నైక్ దాదాపు 35శాతం స్టోర్లను మూసివేస్తున్నట్టు  సమాచారం. 

భాగస్వాముల సంఖ్యను తగ్గించుకొనే  వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుందని  ఇండస్ట్రీ సీనియర్లు వ్యాఖ్యానించారు. గతంలో 20 మందిగా  పార్టనర్ల సంఖ్యను రెండునుంచి మూడుకు తగ్గించే యోచనలో ఉందని తెలిపారు.  పెట్టుబడులపై  క్షీణించిన ఆదాయం, తప్పుడు మార్కెటింగ్ విధానాలే సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయని, రీటైల్ వ్యాపార విస్తరణ ప్లాన్ కూడా  విఫలమైన కారణంగా దుకాణాల మూసివేతకు దారితీసిందని మరో  పరిశ్రమ పెద్ద  అభిప్రాయపడ్డారు. అలాగే  క్రికెట్ పై సంవత్సరానికి దాదాపు 60 కోట్లకు పైగా వెచ్చించే నైక్...భారత  క్రీకెట్  దిగ్గజాలకు కిట్ల స్పాన్సరింగ్  విషయంలో కూడా పునరాలోచిస్తున్నట్టు సమాచారం.

కాగా నైక్  ప్రస్తుతం సుమారు 200 దుకాణాలను నిర్వహిస్తున్న నైక్  అడిడాస్ , రీ బ్యాక్, ప్యూమా లాంటి ప్రత్యర్థి కంపెనీలకు దీటుగా  యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా  ప్రీమియం షూస్, దుస్తులు తదితర  అమ్మకాల్లో పేరు  గడించిన సంగతి తెలిసిందే.  
 

>
మరిన్ని వార్తలు