భారీ వరదలతో తొమ్మిది మంది మృతి

31 Aug, 2016 11:14 IST|Sakshi
భారీ వరదలతో తొమ్మిది మంది మృతి
టోక్యో: జపాన్ దేశాన్ని వరుస తుఫాను(టైఫూన్)లు వణికిస్తున్నాయి. ఈ సీజన్లో అక్కడ ఏర్పడిన పదో తుఫాను 'లయన్రాక్' దాటికి కురిసిన భారీ వర్షాలతో ఓ నర్సింగ్ హోం వరదల్లో మునిగిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది వృద్ధులు మృతి చెందారు. సమీపంలోని నది రాత్రికి రాత్రే తీవ్ర రూపం దాల్చడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

జపాన్ ఉత్తర ప్రాంతంలో తీరం దాటిన ఈ తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దీని ప్రభావంతో రెండు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
 
మరిన్ని వార్తలు