10 లక్షల మందికి రూ.153 కోట్లు

22 Feb, 2017 09:02 IST|Sakshi
10 లక్షల మందికి రూ.153 కోట్లు

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్‌ యోజన, డిజీ ధన్‌ వ్యాపార్‌ యోజన పథకాల ద్వారా సుమారు 10 లక్షల మంది రూ.153.5 కోట్ల మొత్తాన్ని గెలుచుకున్నారని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ప్రకటించారు. వీరిలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలకు చెందిన వారు అధికంగా ఉన్నారని తెలిపారు.

9.8 లక్షల మంది విజేతల్లో 9.2 లక్షల మంది వినియోగదారులు ఉండగా, 56 వేల మంది వ్యాపారులు ఉన్నారని వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు ఉన్నారని పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా ప్రజల్లో డిజిటల్‌ చెల్లింపులు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. డిసెంబర్‌ 25న ప్రారంభించిన ఈ పథకాలు ఏప్రిల్‌ 14 వరకు కొనసాగనున్నాయి.

>
మరిన్ని వార్తలు