'ఆయన రెండో పెళ్లికి అమ్మాయి దొరకలేదు'

20 Oct, 2015 21:52 IST|Sakshi
'ఆయన రెండో పెళ్లికి అమ్మాయి దొరకలేదు'

బక్సర్: బిహార్ ఎన్నికల్లో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రత్యర్థులు విమర్శలకు పదును పెడుతున్నారు. జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యంగాస్త్రాలు సంధించారు. నితీష్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారని, అయితే ఆయన మెడలో దండ వేయాలని ఏ అమ్మాయి కోరుకోవడం లేదని సుశీల్ కుమార్ మోదీ విమర్శించారు. బీజేపీతో జేడీయూకు ఉన్న అనుబంధాన్ని లోక్సభ ఎన్నికలకు ముందు నితీష్ తెగతెంపులు చేసుకున్నారని చెప్పారు.

తమ కూటమికి వరుడు (నితీష్) ఉన్నారని, ఎన్డీయేకు ఎవరూ లేరని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలకు సుశీల్ పైవిధంగాకౌంటర్ ఇచ్చారు. జనతా పరివార్ కూటమి తరపున నితీష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగా.. ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రధాని నరేంద్ర మోదీపై బీజేపీ ఎక్కువగా ఆధారపడుతోంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా