పన్నుమినహాయింపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

14 Jul, 2016 15:23 IST|Sakshi
పన్నుమినహాయింపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: అప్రకటిత ఆదాయంపై దేశీయ నల్లధన కుబేరులు చెల్లించాల్సి  పన్ను వివరాలపై   కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది.  నల్లధనం వెల్లడికి గాను ప్రభుత్వం  తీసుకొచ్చిన వన్-టైమ్ కాంప్లియన్స్ విండో పథకంలో భాగంగా నల్లధనం డిక్లరెంట్స్ కు  గుర్తుతెలియని  ఆస్తులపై  ఆదాయ పన్ను మరియు పెనాల్టీ చెల్లింపులలో మార్పులేదని ఆదాయ పన్ను శాఖ గురువారం  స్పష్టం చేసింది. ఈ చెల్లింపులను 45 శాతం నుంచి 31 శాతానికి   తగ్గించారన్న వార్తలను  ఖండించింది.  వారికి పన్నులనుంచి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.

ఆదాయపు పన్ను శాఖ ఆదాయ డిక్లరేషన్ పథకం  (ఐడిఎస్) నాల్గవ సెట్  క్లారిఫికేషన్స్ ను విడుదల చేసింది.  నల్లధనం కల్గినవారికి ఆఖరి అవకాశంగా సెప్టెంబర్ 30 ముగింపుతో ప్రవేశపెట్టిన వన్-టైమ్ కాంప్లియన్స్ విండో గడువు వినియోగించుకోవాలని కోరింది.  ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెశ్చన్స్ పై క్లారిటీ ఇచ్చిన ఐటీ శాక సర్ చార్చ్,  పెనాల్టీ చెల్లింపులపై , తేడాలు, ఎలాంటి  మోడిఫికేషన్స్ఉండవని తేల్చి చెప్పింది. ఈ పథకం లోపు తమ గుర్తుతెలియని ఆస్తులను వెల్లడిచేస్తే చెల్లించాల్సిన రేటు మార్చే ఉద్దేశ్యము లేదని పేర్కొంది. ఈ వివరాలన్నీ పథకంలో  ముందుగానే స్పష్టంగా పేర్కొన్నామని తెలిపింది. అప్రకటిత ఆదాయంపై 45శాతం సర్ చార్జ్ , పెనాల్టీ 2016 ఆర్థిక చట్టం లోని 184, 185  సెక్షన్లలో గరించి స్పష్టంగా ఉందని పేర్కొంది.


కాగా   2016-17 బడ్జెట్‌లో 4 నెలల కాంప్లియన్స్ విండోను ప్రకటించారు. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకం కింద అప్రకటిత ఆదాయానికి సంబంధించి మొత్తమ్మీద 45 శాతం పన్ను  చెల్లించే అవకాశాన్ని క ల్పించింది.  ఐడిఎస్(ఆదాయం వెల్లడి పథకం)-2016ను జూన్ 1న ప్రారంభించగా, సెప్టెంబర్ 30తో దీని గడువు ముగియనుంది. ఇదే ఆఖరి అవకాశమని, నల్లధనం వివరాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన ఈ విండో ఎవరితోనూ వివరాలను పంచుకోదని, అంతా గోప్యంగా ఉంచుతుందని  ఆర్థికమంత్రి అరుణ్  జైట్లీ ఇటీవల ప్రకటించారు. ఇప్పటిదాకా ఆదాయం వివరాలను వెల్లడించకుండా తప్పించుకు తిరుగుతున్న వారు ఇకనైనా ఈ విండోను వినియోగించుకోవాలని  ఆయన   సూచించిన సంగతి తెలిసిందే.

 

>
మరిన్ని వార్తలు