పొగరాయుళ్లకి ఉద్యోగాలు ఇవ్వం

22 May, 2014 15:41 IST|Sakshi
పొగరాయుళ్లకి ఉద్యోగాలు ఇవ్వం

పొగాకు వాడకందార్లను ఉద్యోగాలలో చేర్చుకూడదని రాజస్థాన్లోని ప్రభుత్వ ఎలక్ట్రసిటీ కంపెనీలు నిర్ణయించాయి. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ఈ మేరకు రాజస్థాన్ రాష్ట్ర ఇంధన శాఖ ఉన్నతాధికారి గురువారం జైపూర్లో వెల్లడించారు. పోగాకు వినియోగించేవారు అంటే పొగాకు నమలడం, పొగత్రాగేవారిని ఉద్యోగాలలో నియమించవద్దంటూ ఉన్నతస్థాయి కమిటీ ఒకటి 2012లో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికను అమలు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది.

 

ఆ క్రమంలో గతేడాది నవంబర్ 2013లో ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇంతలో రాజస్థాన్ శాసనసభకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు అన్ని చకచకా జరిగిపోయాయి. దాంతో ఆ సర్క్యులర్ అటకెక్కింది. ప్రభుత్వం మళ్లీ ఆ సర్క్యులర్ను అమలు చేసేందుకు నడుంకట్టింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఎన్జీవోలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మద్యం, పొగాకు వాడకందార్లకు ఆ అలవాటు మానిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలే కానీ ఇలాంటి నిబంధనలు విధించడం దారుణమని ఎన్జీవో సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు