పెళ్లి చేయడం లేదు..తల్లితండ్రులపై కూతుళ్ల కేసు!

4 Jul, 2014 17:01 IST|Sakshi
రియాద్: సాధారణంగా పెళ్లి చేసుకోమని తల్లితండ్రులు పిల్లల్ని విసిగించడం చూస్తుంటాం కాని.. సౌదీలో మాత్రం అందుకు విరుద్ధమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేయడం లేదనే ఆరోపణలతో గత సంవత్సరం 23 మంది సౌదీ మహిళలు తమ తల్లితండ్రులపై కేసు నమోదు చేసినట్టు నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. 
 
రియాద్ లో 11 కేసులు, మదీనాలో నాలుగు, దామ్మమ్, మక్కాలో ఇద్దరేసి, జెడ్డా, జజాన్ లో ఒక్కొక్కరు తమ తల్లితండ్రులపై కేసులు నమోదు చేసినట్టు అరబ్ న్యూస్ ఓ కథనంలో వెల్లడించింది. అరబిక్ లో ఇలాంటి కేసులను 'అదిల్' అంటారు. ఆదిల్ నుంచి మహిళలకు రక్షణ కల్పించాని మానవ హక్కుల సంఘం ప్రభుత్వానికి విజ్క్షప్తి చేసింది.
 
యుక్త వయస్సు వచ్చిన తర్వాత మహిళలు పెళ్లి చేసుకునే విధంగా ఓ చట్టం తీసుకురావాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. కేసుల్ని నమోదు చేసిన మహిళలు తమ తల్లితండ్రులను విముక్తిని కోరుకుంటున్నారని సామాజిక కార్యకర్తలు తెలిపారు. 
 
అయితే తల్లి తండ్రులు మాత్రం తమ కూతుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూరంగా పెడుతున్నట్టు తెలిసింది. వారి సొంత సంపాదనతోనే తమ పిల్లలు బ్రతకాలని తల్లితండ్రులు సూచించారట. 
మరిన్ని వార్తలు