ఇక చైన్ లాగితే రైలు ఆగదు!

10 Jun, 2015 07:34 IST|Sakshi
ఇక చైన్ లాగితే రైలు ఆగదు!

న్యూఢిల్లీ: చైన్ లాగితే రైలు ఆగడం ఇక గతం కాబోతోంది. చైన్ లాగే విధానం దుర్వినియోగానికి గురవుతుండడం, తరచూ రైళ్లు ఆగిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవడం వంటి కారణాలతో ‘చైన్’కు స్వస్తి పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇకపై ప్రయాణికులు అత్యవసర సమయాల్లోనే నేరుగా రైలు డ్రైవర్‌నే సంప్రదించవచ్చు.

 

ఇందుకు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఇద్దరి నంబర్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. దాంతోపాటు రైల్లోని ఇతర సిబ్బంది కూడా వాకీటాకీలతో అందుబాటులో ఉంటారు. అత్యవసరమైతే  ప్రయాణికులు వారిని సంప్రదించవచ్చు. చైన్ విధానాన్ని ఇప్పటికే చాలా కోచ్‌లలో తీసేశారు. కొత్త బోగీల్లో చైన్‌లు లేకుండా చూడాలని కోచ్ తయారీ యూనిట్లకు సూచనలు అందాయి.

మరిన్ని వార్తలు