'మణి రాజీనామా చేయాల్సిన పనిలేదు'

10 Nov, 2015 13:22 IST|Sakshi
'మణి రాజీనామా చేయాల్సిన పనిలేదు'

తిరువనంతపురం: కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణికి కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేరళ చీఫ్ విప్, కాంగ్రెస్ నేత థామస్ ఉన్నియదాన్ అన్నారు. హైకోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా లేదని పేర్కొన్నారు. ఆయనను కోర్టు దోషిగా ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. మణి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

హైకోర్టు తీర్పును మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. మంత్రి పదవికి మణి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ విషయంలో కేరళ కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందన్న వాదనను తోసిపుచ్చారు. తామంతా మణికి మద్దతు తెల్పుతున్నామని అన్నారు. కేఎం మణి లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బార్ల లైసెన్సులను పునరుద్ధరించేందుకు ఆయన కోటి రూపాయలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు